ఫొటో ఫీచర్: అందంలో సంగీతను మించిపోయిన కూతురు!
on Feb 24, 2021
నటి సంగీత అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది! తీర్చిదిద్దినట్లుండే రూప లావణ్యంతో ఆకట్టుకొనే సంగీత తెలుగు సహా దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ హీరోయిన్గా నటించింది. అదివరకు రెండు మూడు సినిమాలు చేసినా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'ఖడ్గం' మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అందులో హీరోయిన్ కావాలనుకొని ఊరువిడిచి హైదరాబాద్ వచ్చి కష్టాలుపడే సీతాలక్ష్మి క్యారెక్టర్లో సూపర్బ్‌గా రాణించింది. అందుకే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.
దాని తర్వాత పెళ్లాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, మా ఇంటికొస్తే ఏం తెస్తారు మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి, నా ఊపిరి తదితర చిత్రాల్లో చేసిన పాత్రలతో ఆడియెన్స్‌ను అలరించింది. స్వతహాగా తమిళియన్ అయిన ఆమె మాతృభాషలోనూ అక్కడి స్టార్స్‌తో పలు సినిమాలు చేసింది. ఈ మధ్యలో పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ క్రిష్‌తో లవ్‌లో పడిన సంగీత, ఆయనను 2009లో వివాహం చేసుకుంది.
పెళ్లి ఆమె కెరీర్‌కు అడ్డు కాలేదు. ఓవైపు భార్యగా, కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు నటనను కొనసాగించింది. భర్త, అత్తామామలు కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. సంగీత, క్రిష్ దంపతులకు 2012లో పాప శివియా పుట్టింది. ఇప్పుడు శివియాకు తొమ్మిదేళ్లు. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సంగీత షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోల్లో శివియాను చూసినవాళ్లంతా ముచ్చటపడుతున్నారు. అందగత్తె అయిన తల్లిని మించిన అందంతో లిటిల్ ఏంజెల్లా మెరిసిపోతోందని కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సంగీతకు కలైమామణి అవార్డును ప్రకటించింది. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకుంది. ఆ వేడుకకు భర్త క్రిష్, కూతురు శివియాతో వచ్చింది. తన మెడల్‌ను కూతురి మెడలో వేసి, భర్తతో కలిసి దిగిన పిక్చర్‌ను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది సంగీత. ఆ ఫొటోను చూసినవాళ్లు సంగీత కూతురు ఇంత పెద్దదైందా అని ఆశ్చర్యపోవడంతో పాటు, శివియా ఏంజెల్లా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.
సంగీత గత ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్టయిన మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'లో హీరోయిన్ రష్మికా మందన్న తల్లిగా నటించి, అలరించింది.
Also Read