సమంతకు.. సమంత లాంటి చెల్లెలు ఉందా..?
on Feb 10, 2017
భగవంతుడు మనుషుల్ని పోలిన మనుషుల్ని ఏడుగురిని సృష్టిస్తాడంటారు..కానీ కొందరి ఇళ్లలో మాత్రం అచ్చుగుద్దినట్లు ఇద్దరు కవలలు ఉంటూ ఉంటారు. మామూలు జనం విషయంలో ఇలాంటి వార్తలు ఆ కుటుంబం వరకో..లేదంటే ఆ ఊరు వరకో గొప్ప..కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటివి ఫుల్ ఫేమస్ అయిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే త్వరలో అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లబోతున్న సమంత అచ్చం తన పోలికలతో ఉన్న అమ్మాయిని చూసి షాకయ్యిందట.
అశు రెడ్డి అనే అమ్మాయి అచ్చుగుద్దినట్టు సమంత పోలికల్లోనే ఉంది..సమ్ పలికిన డైలాగుల్ని డబ్స్మాష్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది. రోజు రోజుకి ఈవిడను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ విషయం తెలియని వారు సమంతకు ట్వీన్ సిస్టర్ ఉందేమోనని నెట్లో తెగ వెతికేస్తున్నారట.