కరోనా నుండి కోలుకున్న టీవీ స్టార్
on Jul 15, 2020
హోమ్ క్వారంటైన్లో ఉండి... వైద్యుల సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ, జాగ్రత్తగా చికిత్స తీసుకొంటే కరోనాను జయించవచ్చని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సుమారు పది, పన్నెండు రోజుల క్రితం టీవీ నటుడు రవికృష్ణ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డారు.
"అందరికీ హాయ్. కొవిడ్ 19 నుండి రికవరీ అయ్యాను. కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ అని వచ్చింది. ఈ సమయంలో నాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ థాంక్స్. ప్రజలు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా" అని రవికృష్ణ వెల్లడించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, స్టయిలిస్ట్ శిల్పారెడ్డి సైతం కరోనా నుండి కోలుకున్న విషయాన్ని వెల్లడించారు.
హిందీ సినిమా ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే తెలుగులో కరోనా బారిన పడిన ప్రముఖులు తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువ ఉండటంతో అక్కడ నివాసం ఉంటున్న సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. అమితాబ్ ఫ్యామిలీ, అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే.
Also Read