అభిషేక్‌కు కొవిడ్-19 నెగటివ్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్!
on Aug 8, 2020
నాలుగు వారాలుగా కొవిడ్-19 ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్‌కు ఎట్టకేలకు టెస్ట్‌లో నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో శనివారం నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేశాడు అభిషేక్. "ఈ మధ్యాహ్నం నేను కొవిడ్-19 నెగటివ్‌గా టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది!!! దీన్ని నేను ఓడిస్తానని నేను మీకు చెప్పాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ థాంక్స్. నానావతి హాస్పిటల్లో మమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకున్న డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్‌కు నేను రుణపడి ఉంటాను. వాళ్లు లేకపోతే మాకిది సాధ్యపడేది కాదు. థాంక్ యు!" అని అతను పోస్ట్ చేశాడు.
దీంతో పాటు, హాస్పిటల్లో తన కేర్ బోర్డ్ పిక్చర్‌ను కూడా షేర్ చేశాడు అభిషేక్. "నేను మీకు చెప్పాను!! డిశ్చార్జ్ ప్లాన్: యస్!! ఇంటికి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది" అని అతను తెలిపాడు.
ఆగస్ట్ 2న అభిషేక్ తండ్రి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టెస్ట్‌లో నెగటివ్ అని తేలి, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. వాళ్ల కుటుంబంలో ఒక్క జయా బచ్చన్ మినహా మిగతా నలుగురూ.. అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కొవిడ్-19కు గురై నానావతి హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. తల్లీకూతుళ్లు చాలా త్వరగా కోలుకుని ముందుగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లారు. అందరికంటే ఆలస్యంగా కొవిడ్ నుంచి కోలుకోవడానికి అభిషేక్‌కు నాలుగు వారాల సమయం పట్టింది.