`ఆర్ ఆర్ ఆర్`కు రూటు మార్చిన జక్కన్న!!
on Jul 29, 2019
ఏ ముహూర్తాన `ఆర్ ఆర్ ఆర్` ను మొదలు పెట్టాడో కానీ రాజమౌళి మొదటి నుంచి అన్నీ ఆటంకాలే వస్తున్నాయి. అవును మొదట ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఏమైందో ఏమో కానీ ఆమె సడన్ గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ చేస్తుండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ కి చాలా గ్యాప్ వచ్చింది. ఇక తాజాగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్ దాదాపు ఖరారైనట్లే తెలిసిందే. ఏమైందో కానీ ఇప్పుడు ఎమ్మా కూడా నో చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి హీరోయిన్ వేటలో పడింది చిత్ర యూనిట్. ఇక రాజమౌళి మొదట పూణే తదుపరి షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాడట. ఇప్పుడు రూట్ మార్చి ఈ షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకనేది రాజమౌళికే తెలియాలి. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారట. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పెయిర్ పై చాలా సీన్స్ చిత్రీకరించాలనకున్నారట. ఎమ్మా హ్యాండ్ ఇవ్వడంతో కేవలం ఎన్టీఆర్ కి సంబంధించిన సీన్స్ తీయనున్నారట.