రవితేజను నమ్ముకున్న స్టార్ డైరెక్టర్!!
on Feb 26, 2019
మాస్ సినిమాలను తెరకెక్కించడంలో స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ స్టైలే వేరు. టాప్ హీరోలందరితోనూ ఆయన వర్క్ చేసారు. మంచి సక్సెస్ లు కూడా అందుకున్నారు. మెగాస్టార్ రీ -ఎంట్రీ `ఖైదీ నెంబర్ 150` తర్వాత ఆయన మేనల్లుగు సాయి ధరమ్ తేజ్ తో `ఇంటిలిజెంట్` సినిమా చేశాడు .ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇంత వరకు ఏ సినిమా చేయలేదు వినాయక్. ఆ మధ్య బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. తాజాగా రవితేజతో ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల రవితేజ స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సి.కళ్యాన్ నిర్మించనున్న ఈ సినిమా జూలై లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలన్న కసితో ఉన్నాడట దర్శకుడు వినాయక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో `కృష్ణ ` చిత్రం వచ్చింది. ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొంది మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ చిత్రానికి సీక్వల్ చేయబోతున్నారనే వార్త కూడా అందుతోంది. చూద్దాం ఎలా ఉంటుందో మరి.