మహేష్‌తో బాలయ్య హీరోయిన్!
on Nov 21, 2018
తెలుగులో సోనాల్ చౌహన్ కథానాయికగా నటించిన సినిమాలు సంఖ్య తక్కువే. అరడజను సినిమాలు మాత్రమే చేసింది. అందులో రెండో కథానాయికగా చేసినవే ఎక్కువ. నటన కంటే అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇచ్చిన సినిమాలే ఎక్కువ. ఇవన్నీ పక్కన పెడితే... అరడజనులో రెండు సినిమాల్లో బాలకృష్ణ హీరో. సోనాల్ చౌహన్ హీరోల్లో స్టార్ హీరో కూడా ఆయనే. ఇప్పుడీ ముంబై భామకు సూపర్ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చింది. మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ నిర్మిస్తున్న సినిమా 'మహర్షి'. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. సెకండ్ హీరోయిన్గా సోనాల్ చౌహన్‌ని సెలెక్ట్ చేశార్ట! త్వరలో ఆమె షూటింగులో పాల్గొంటుందని టాక్. 'లెజెండ్' మినహా ఇప్పటివరకూ తెలుగులో సోనాల్ చౌహన్‌కు భారీ సక్సెస్ లేదు. ఆ లోటు 'మహర్షి' తీరుస్తుందని ఆమె ఆశిస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు.