పవన్ కెరీర్‌పై అనిరుధ్ పాట చూశారా..?
on Dec 13, 2017
పవర్‌స్టార్.. పీఎస్పీకే.. జనసేనాని.. అభిమానులు పవన్‌కళ్యాణ్‌ను ముద్దుగా పిలుచుకునే పేర్లవి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమైన ఓ కుర్రాడు.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దేవుడిగా పూజలందుకుంటాడని ఆ రోజున ఎవ్వరూ ఊహించి ఉండరు. తనదైన నటనతో.. అంతకు మించిన వ్యక్తిత్వంతో పవన్ జనానికి చేరువయ్యాడు. అలాంటి పవన్‌కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు గడిచిపోయాయి.. 24 సినిమాలు కంప్లీట్ చేసి ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నాడు. అదే అజ్ఞాతవాసి.. ఒక్కసారి పవన్‌ను దగ్గరి నుంచి చూసినా.. ఆయనతో మాట్లాడినా వెంటనే ఫిదా అయిపోతారని టాలీవుడ్ జనాలు తరచూ చెప్పేమాట.
రీసెంట్గా ఆ లిస్ట్‌లోకి చేరిపోయాడు.. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్. అజ్ఞాతవాసి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌ను తీసుకున్నాడు త్రివిక్రమ్.. ఈ సమయంలో పవన్‌తో ఆయనకు దోస్తి బాగా కుదిరింది. ఇది పవన్‌కు 25వ సినిమా అని తెలుసుకున్న అనిరుధ్ ఆయనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. దీనిలో భాగంగా ఓ పాటను రూపొందించి పవర్‌స్టార్‌కు అంకితమిచ్చాడు. "గాలి వాలుగ ఓ గులాబి వాలి" అని సాగే లిరికల్ వీడియోను నిన్న చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. ఈ పాటలో నటిస్తూ.. పాడుతూ ఉన్న వీడియోని అనిరుధ్ ఇవాళ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిలో పవన్ సినీ కెరీర్‌ను గుర్తు చేస్తూ.. ఆయన సినిమా పోస్టర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తాయి. ప్రజంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పవన్ ఫ్యాన్స్ దీనిని తెగ షేర్ చేస్తూ పవర్‌స్టార్‌పై తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు.