English | Telugu

అనుష్క లవర్ ఒక క్రికెటర్..!!

on Nov 9, 2017

అమ్మాయిలు అబ్బాయిలతో కొంచెం చనువుగా ఉంటే చాలు వారిద్దరికి లేనిపోనివి అంటగంటే లోకం ఇది. అలాంటిది సినిమా ప్రపంచంలో హీరోహీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా హీరోయిన్.. ఫలానా హీరోతో ఎక్కువ సినిమాలు చేసినా.. బయట కనిపించినా ఇక చూస్కోంది.. ఆ హీరో గారి ప్రేమలో హీరోయిన్ అంటూ పుకార్లు షికారు చేస్తాయి. మిగిలిన హీరోయిన్ల సంగతి ఏమో కానీ అనుష్క విషయంలో మాత్రం ఇది కాస్త ఓవర్ అవుతోంది. ప్రభాస్‌తో అనుష్క పెళ్లి ఫిక్స్ అయిపోయిందని.. అతి త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారనే వార్త ఫిలింనగర్‌లో ఎన్ని వందల సార్లు చక్కర్లు కొట్టిందో..!!. ఇద్దరూ దానిని ఎన్నిసార్లు ఖండించినా లాభం లేకపోవడంతో వాటికి అలవాటు పడిపోయారు.

ప్రభాస్‌తో పెళ్లి సంగతేమో కానీ.. ఓ బాంబు పేల్చింది స్వీటీ.. ఆమె టీమిండియా క్రికెటర్‌ ఒకరితో పీకల్లోతు ప్రేమలో ఉందట. ఈ విషయం అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. ది వాల్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. నా చిన్నతనం నుంచి ద్రవిడ్ అంటే నాకు పిచ్చి.. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా అని చెప్పుకొచ్చింది. మొత్తానికి అనుష్కకి కూడా ఓ లవర్‌ ఉన్నాడన్నమాట.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here