English | Telugu

నన్ను పెళ్లాడవా! అని అడిగేస్తున్నారు!

on Oct 28, 2017


టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ ఎవరు? అనడిగితే.. ఠపీమని వచ్చే సమాధానం ‘ప్రభాస్’. ప్రభాస్ కున్న లేడీ ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు. అసలే హీమేన్ లా ఉంటాడా..! అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు. ప్రభాస్ పెళ్లాడబోయే ఆ అదృష్టవంతురాలు ఎవరు? అదేని ఇప్పుడు హాట్ టాపిక్. పెళ్లి టాపిక్ ఎత్తితే చాలు... ‘నాకే తెలీదు. ఇక మీకేం చెప్పను’ అంటూ చిరునవ్వుతోనే మాధానిమిస్తుంటాడు ప్రభాస్. పైగా ‘బాహుబలి’ సినిమాల ముందు ప్రభాస్ కీ .. తర్వాత ప్రభాస్ కీ చాలా వ్యత్యాసంఉంది. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్. మరి ఈ యంగ్ రెబల్ స్టార్ ని అల్లుడ్ని చేసుకోడానికి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ రెడీగా ఉండటం కామన్. ముఖ్యంగా ఈ సారి జరిగిన ప్రభాస్ పుట్టినరోజు వేడుకంతా పెళ్లిగోలతోనే సాగింది. మునుపెన్నడూ రానన్ని ప్రేమలేఖలు ఈ దఫా ప్రభాస్ అందుకున్నాడు. నన్ను పెళ్లాడవా? అని డైరెక్ట్ గా అడిగేసిన అమ్మాయిలు ఎందరో. ఈ దఫా పుట్టినరోజుకు అమ్మాయిల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రభాసే బిత్తరపోయాడట. ప్రభాస్ కి 38 ఏళ్లు నిండాయ్. ‘బాహుబలి’ హడావిడి ముగిశాక పెళ్లాడతానని అంతకు ముందు మీడియాకు చెప్పాడు. ఆ హడావిడి ముగిసింది అనుకునేలోపు ‘సాహో’తో బిజీ అయిపోయాడు. మరి మన ‘బాహుబలి’ పెళ్లిపీటలు ఎప్పుడెక్కుతాడో?

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here