పవర్ స్టార్ కథతో బాలీవుడ్ సినిమా!
on Sep 4, 2017
పవర్ స్టార్ ‘కాటమరాయుడు’ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో నటించేది ఎవరో కాదు... బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. అజిత్ నటించిన ‘వీరమ్’ చిత్రానికి ‘కాటమరాయుడు’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే... తమిళంగా ఘన విజయాన్ని అందుకున్న ఈ కథ... తెలుగు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందులో లేకపోయింది. హిందీలో మాత్రం కచ్చితంగా ఈ కథ ఆకట్టుకుంటుందని అక్షయ్ నమ్మాడట. అందుకే... ఇమ్మిడియట్ గా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఇటీవలే ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అక్షయ్... ప్రస్తుతం తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మించిన ‘ప్యాడ్ మేన్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఈ రీమేక్ ఉంటుంది. సాజిత్ నడియావాలా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అక్షయ్ ఆద్యంతం లుంగీలోనే కనిపించనున్నారట.