ప్రభాస్‌ని తెగ మెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో
on Jul 7, 2017
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి విడుదల కాకముందు ప్రభాస్ నెంబర్ వన్ రేస్ లో లేడు. మిర్చి సూపర్ హిట్ అవ్వడం... ఆ తర్వాత వచ్చిన బాహుబలి అన్ని రికార్డులని బ్రేక్ చేయడం... ప్రభాస్ ని స్టార్ ని చేశాయి. బాహుబలి అయితే, ప్రభాస్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లింది. బాలీవుడ్ ఆడియన్స్ కూడా ప్రభాస్ కి ఫాన్స్ అయ్యారంటే, ఆ సినిమా ప్రభాస్ కి ఎంత పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఒక బాలీవుడ్ పాపులర్ హీరో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అని... ఈ మధ్య వచ్చిన సినిమాల్లో బెస్ట్ పెరఫార్మెర్ ప్రభాస్ యే అని... బాహుబలి లో ప్రభాస్ నటన అద్భుతం అని... కితాబిచ్చారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటారా? త్వరలో జగ్గా జాసూస్ అనే హిందీ సినిమా ద్వారా మనముందుకు వస్తున్న రన్బీర్ కపూర్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ మొదలయిన ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం క్యూ పెద్దగానే ఉందట. మరి ప్రభాసా మజాకా!