ENGLISH | TELUGU  

ఫ్యాన్స్ మీట్ లో సంచలనం సృష్టించిన రజనీకాంత్ !!

on May 15, 2017

 

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఓ మంచి అలవాటుంది. ప్రతి ఆరు నెలలకోసారి తన అభిమానగణాన్ని ఒకసారి కలుస్తుంటారు. అది కూడా సాదాసీదాగా కాదు.. ఒక సభ ఏర్పాటు చేసి అభిమానులతో కాసేపు ముచ్చటించి.. అందర్నీ పేరుపేరునా పలకరించి ఆఖర్లో తన భవిష్యత్ ప్రణాళికలు వివరించి అందరికీ కడుపునిండా భోజనం పెట్టించి మరీ వీడుకోలు పలుకుతుంటారు.  ఆ తరహా సభను రజనీ నేడు చెన్నైలో నిర్వహించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలుకొని తన తాజా చిత్ర విశేషాల వరకూ ఎన్నో వెల్లడించారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం..!!

నేను ఇప్పటివరకూ రాజకీయ పరమైన ఆలోచనలేవీ చేయలేదు. ఒకవేళ దేవుడి దయ ఉండి, ఆయన కరుణిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. అయితే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లుగా ఏ పార్టీకి నా సపోర్ట్ ఉండదు. ముఖ్యంగా డబ్బు మదంతో ఉన్న ఏ ఒక్కరికీ నా దగ్గర స్థానం ఉండదు.  నా సినిమాలు హిట్ అవుతున్నాయా లేక ఫ్లాప్ అవుతున్నాయా అనే విషయాలు పక్కనపెట్టి.. అనునిత్యం నాకు అండగా నిలుస్తున్న అభిమానులందరికీ నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను.  నా తాజా చిత్రం హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా తెరకెక్కనుందని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ముంబైకు చెందిన ఓ మాఫియా డాన్ గా కనిపిస్తాను. పా.రంజిత్ మంచి కథను సిద్ధం చేశాడు. జూలై నుంచి సినిమా సెట్స్ కు వెళుతుంది.  రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం మొదలెట్టాక సినిమాల్లో కొనసాగుతానా లేదా అనే విషయంలో నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు. ఆ విషయంలో స్పష్టత ఇవ్వడానికి నాకు కొంత సమయం కావాలి.

 

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.