తెల్లగా ఉండటం వల్లే తాప్సీకి ఆఫర్స్ రాలేదా..?
on Feb 3, 2017
హీరోయిన్‌కు మొదటి క్వాలిఫికేషన్ అందం..యాక్టింగ్ వచ్చా, డైలాగ్స్ చెప్పగలదా ఇవన్నీ సెకండరీ ఇష్యూస్..ఎంత టాలెంట్ ఉండి ఏం ప్రయోజం..అందం లేకపోవడం అనే చిన్న లోపం కారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లు కాలేకపోయారు..కానీ అందం కూడా శాపమేనంటోంది తాప్సీ పన్ను. ఝుమ్మందినాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ తాప్పీ. పాలరాతి శిల్పం లాంటి మేనిఛాయ, సొట్టబుగ్గలు, చక్కని చిరునవ్వుతో యూత్‌కి గిలిగింతలు పెట్టింది తాప్సీ. కానీ ఎంత స్పీడుగా ఇండస్ట్రీలోకి వచ్చిందో అంతే స్పీడుగా ఫేడవుట్ అయిపోయింది.
ఇటీవల ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ వాళ్లు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్‌కు తాప్సీని ఆహ్వానించారట నిర్వాహకులు..అయితే తాను ఆ ఈవెంట్‌కు రాలేనని..అయినా క్రీమ్‌లు వాడితే తెల్లగా అవుతారంటే నమ్మనని..అలాంటి వాటిని తాను ప్రమోట్ చేయనని తేల్చి చెప్పేసిందట. తెల్లగా ఉన్నంత మాత్రాన అవకాశాలు రావని, అలాగైతే తాను వైట్‌గా ఉండి అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. అన్నట్టు త్వరలో విడుదలకానున్న ఘాజీలో రానా సరసన నటించింది తాప్సీ.