కోట + శ్రీదేవి = సునీల్
on Oct 5, 2016
సునీల్ తనకు తాను ఓ సరికొత్త నిర్వచనం ఇచ్చుకొన్నాడు. కోట శ్రీనివాసరావు, శ్రీదేవి కలిపితే తానవుతానని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. కోట శ్రీనివాసరావు అంటే సునీల్‌కి చాలా ఇష్టమట. ఆయన్ని చూసే విలన్ అవుదామని ఈ ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టాడట. శ్రీదేవి ఇన్నోసెంట్ లుక్ భలే బాగుంటుందని, ఏ పాత్ర చేసినా సరే.. ఆ ఇన్నోసెంట్ ఫేస్‌తో పడేసేదని, తాన ఫేస్‌లో ఉన్నా ఆ అమాయకత్వం పలుకుతుందని చెప్పుకొచ్చాడు సునీల్. విలన్‌గా తనకు ఇతర భాషల నుంచి అవకాశాలొస్తున్నాయని అక్కడ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నానని చెప్పాడు. తెలుగులో విలన్ గా నటిస్తానటే ఎవ్వరూ నమ్మరు. అందుకే తొలి ప్రయత్నంగా మరో భాషలో విలన్‌గా కనిపిస్తా. అప్పుడు ఆ పాత్రలకూ నేను సరిపోతానని అర్థమవుతుంది. మరో భాషలో నిరూపించుకొన్న తరవాతే తెలుగులో విలన్‌గా కనిపిస్తా అంటున్నాడు. ఆ మరో భాష ఏంటో అప్పుడే చెప్పడట.
నటుల్లో మీకు స్ఫూర్తి ఎవరు కంటే చిరు, కమల్ల పేర్లు చెప్పుకొచ్చాడు సునీల్. చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ఆయన్ని చూసే ఇండ్రస్ట్రీలోకి వచ్చా. ఆయన డాన్సులు, ఫైట్స్‌కి వీరాభిమానిని. అయితే శుభసంకల్పం చూసి షాకయ్యా. ఆ సినిమాలో కమల్ హాసన్ మైమ్ చేస్తుంటే థియేటర్లో అందరూ స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలాంటిచోట కూడా క్లాప్స్ కొడతారా అనిపించింది. నటుడన్నాక నటించాలి, ఆ తరవాతే మిగిలినవి అని ఆరోజు తెలిసింది. అది నిజమే కదా, డాన్సులు ఫైటులు సినిమా మొత్తమ్మీద అరగంట కనిపిస్తాయేమో? మిగిలిన రెండు గంటలూ నటించాలి కదా? `` అంటూ లాజిక్ తీశాడు సునీల్.