అభిమానులతో లైవ్ చాట్ లో చరణ్ చెప్పిన సంగతులు..!!
on Jul 14, 2016
మొట్టమొదటిసారిగా ఫేస్ బుక్ లైవ్ ద్వారా దాదాపు 13 నిమిషాలపాటు తన అభిమానులతో "లైవ్ చాట్" చేసిన రామ్ చరణ్ తాను నటిస్తున్న "ధృవ" గురించి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తున్న 150వ చిత్రం గురించి చాలా విశేషాలు చెప్పాడు. ఆ విశేషాలు మీకోసం..!!
ధృవ సినిమా గురించి...
>> సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న "ధృవ" చిత్రం ఫస్ట్ లుక్ ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారట.
>> అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో "ధృవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
>> "ధృవ" కాశ్మీర్ షెడ్యూల్ లో చరణ్ విపరీతంగా ఎంజాయ్ చేశాడట, కుదిరితే కుటుంబంతో సహా అందర్నీ కాశ్మీర్ కు సెలవులకు వెళ్ళమని చెబుతున్నాడు.
మెగా 150వ సినిమా గురించి..
>> ప్రచారంలో ఉన్నట్లుగా చిరంజీవి 150వ చిత్రం టైటిల్ "కత్తిలాంటోడు" కాదు అని చరణ్ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం మంచి టైటిల్ అన్వేషణలో ఉన్నారట. మంచి టైటిల్ సెట్ అవ్వగానే ఎనౌన్స్ చేస్తారట.
>> మెగా 150వ సినిమా అప్పుడే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొంది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
>> మెగా రీఎంట్రీ సినిమాలో నేను నటించను, ఒకవేళ వినాయక్ గారు, నాన్నగారు (చిరంజీవి) చేయమని చెబితే మాత్రం ఏదైనా పాటలో మాత్రం కనిపిస్తాను.
>> ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా 150వ చిత్రం సంక్రాంతికి విడుదలవ్వడం ఖాయమని చరణ్ స్పష్టం చేశాడు.
"స్వచ్చ భారత్" తరహా ప్రోజెక్ట్..
>> "స్వచ్చ భారత్" ఫార్మాట్ లో "మెగా ఫ్యాన్" అనే ఒక ప్రోజెక్ట్ ను మొదలెట్టాలన్నది చరణ్ అభిప్రాయం. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే.. ఆ సమస్యకు సంబంధించిన వివరాలు ఫోటోతో సహా తన ఫేస్ బుక్ పేజ్ కి పంపితే "మెగా ఫ్యాన్స్" సహాయంతో ఆ సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని చరణ్ చెప్పాడు.
పవర్ స్టార్ తో సినిమా గురించి..
>> మంచి కథ దొరకాలే కానీ.. కళ్యాణ్ బాబాయ్ తో కలిసి నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.