అప్పుడు నగ్మ- ఇప్పుడు టబు!!
on Mar 23, 2019
హెడ్డింగ్ చూసి ఏంటా? అని హెడ్ హేక్ తెచ్చుకోకండి. ఆ మధ్య బన్ని- త్రివిక్రమ్ సినిమాలో నగ్మ ఓ కీలక పాత్రలో నటిస్తోందంటూ వార్తలు తెగొచ్చాయి. దాదాపు ఖారారైనట్లే అన్నారు కూడా. అయితే నగ్మ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఓ ఛానెల్ తో మాట్లాడుతూ `నేను బన్నీ సినిమాలో నటిస్తున్నానా? నన్నింత వరకు ఎవరూ సంద్రించలేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నగ్మ నటించడం లేదంటూ అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు టబు పేరు తెరపైకి వచ్చింది . బన్నీ మదర్ గా టబు ని తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి నగ్మా లాగే టబు పేరు తెరపైకి వచ్చిందా? లేక దర్శక నిర్మాతలు ఫైనల్ చేసారా? అనే దానిపై త్వరలో ఒక క్లారిటీ రానుందట.
గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి `నాన్న నేను` అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమా లో బన్ని చాలా స్లిమ్ గా కనిపించనున్నాడట. ఇప్పటికే బరువు తగ్గడానికి కసరత్తులు ప్రారంభించాడట. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.