సరైనోడులో ఇరగదీసిన అల్లు అర్జున్..!
on Apr 22, 2016
సరైనోడు గురించిన రివ్యూలు బయటికొచ్చేశాయి. సినిమాలో ఫైట్స్ గురించి, బోయపాటి మాస్ అప్పీల్ గురించే కాకుండా, అందరూ మాట్లాడుకుంటున్న మరో టాపిక్ ఉంది. అదే బన్నీ ట్రాన్స్ ఫర్మేషన్. ఎలాంటి అల్లు అర్జున్, ఎలా ఛేంజోవర్ అయ్యాడో చూస్తే వావ్ అనిపించక మానదు. సరిగ్గా చూస్తే బన్నీ తన కెరీర్ మొత్తాన్ని అద్భుతంగా ప్లాన్ చేసుకుని నడిపించాడు. గంగోత్రి సమయంలో చూసి హీరోగా సెట్ అవుతాడా అనుకున్న వాళ్లే, ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఇచ్చి చప్పట్లు చరిచారు. ఇది నిస్సందేహంగా బన్నీ సాధించిన విజయమే.
సినిమా సినిమాకూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించడానికే అల్లు అర్జున్ కష్టపడుతుంటాడు. ఇప్పుడు సరైనోడులో కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి స్థాయి మాస్ హీరోగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇన్నాళ్లూ అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు తీసినా, కేవలం స్టైల్ గానే, యూత్ టార్గెట్ గానో ఉండేవి. కానీ మొట్టమొదటి సారి పూర్తి స్థాయి మాస్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీలో చేశాడు బన్నీ. టెన్త్ క్లాస్ పిల్లాడి రోల్ తో మొదలెట్టి, మొదట డ్యాన్స్ ను మాస్టర్ చేసి, కామెడీ ని అలవాటు చేసుకుని, సన్నాఫ్ సత్యమూర్తి టైం కి సెంటిమెంట్ ను పండించడంలో కూడా ప్రూవ్ చేసుకున్న బన్నీ, ఇప్పుడు మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి సరైనోడుగా వచ్చాడు. సినిమా చూసిన వాళ్లందరికీ, ఫస్ట్ టు లాస్ట్ బన్నీయే కనిపించడం విశేషం. ఎంతో డెడికేషన్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదంటూ చూసిన వారందరూ బన్నీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తన కష్టంతో, అల్లు అర్జున్ చాలా మంది స్టార్ హీరోలకు ఉదాహరణగా నిలుస్తున్నాడన్నది మాత్రం వాస్తవం.
Also Read