సమంత హాటు.. స్పందన ఘాటు !
on Sep 28, 2018
భర్త నాగచైతన్యతో కలిసి సమంత హాలిడే ట్రిప్‌కి వెళ్ళింది. అక్కడ తీసుకున్న ఫొటోలు కొన్నిటిని సామజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్వట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఒక ఫొటోలో బికినీకి కాస్త ఎక్కువ, బట్టలకు చాలా తక్కువ అనేలా వున్నాయి. ఆమెను అలా చూసి అవాక్కవ్వడం ప్రేక్షకుల వంతైంది. కొంతమంది అయితే 'పెళ్లి తరవాత ఇటువంటి బట్టలేంటి?' అని పబ్లిగ్గా మాటలు అన్నారు. 'ఛీ... ఛీ... బూతు పనులేంటి?' అని కొందరు ప్రశ్నించారు. వీటిని చూస్తే ఎవరైనా బాబోయ్ అనక తప్పదు. ప్రేక్షకుల అతివాద స్పందనలపై సమంత ఘాటుగా స్పందించింది. ఆమె కూడా తక్కువేం తినలేదు. ఆమె స్పందించిన తీరు చూస్తే అయ్యబాబోయ్ అంటారు మరి!
ప్రేక్షకుల స్పందనలను సావధానంగా చదివిన సమంత సామాజిక మాధ్యమాల్లో మధ్య వేలు చూపిస్తూ ఒక సింబల్ చూపించింది. దానికి ఇంగ్లిష్ భాషలో 'f...k' అని అర్థం వస్తుంది. 'పెళ్లి తరవాత జీవితంలో నేను ఎలా వుండాలో చెప్పే వారందరికీ నా సమాధానం ఇదే' అని సమంత సెలవిచ్చింది. 'నా జీవితం నా ఇష్టం' అన్నట్టు సమంత సమాధానం వుందని పలువురి అభిప్రాయం. పెళ్లి తరవాత గతంలో ఇదే విధంగా బికినీ ఫొటోలు సమంత పోస్ట్ చేయగా... కొందరు అక్కినేని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడూ ఇదే విధంగా స్పందించిందీమె.