రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా ఉంటుందా??
on Jan 7, 2019
`బాహుబలి` సిరీస్ తో రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగిపోయింది. దీంతో ఇప్పుడు ఆయన సినిమా అంటే తెలుగుతో పాటు ఇండియన్ సినిమా అంతా వేచి చూస్తోంది. ప్రస్తుతం రాజమౌళి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో ఒకసారి రాజమౌళి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అన్నాడు. అయితే ఇప్పుడు రజనీకాంత్ తో జక్కన్న సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న దర్శకధీరుడు . ఆ తర్వాత రజినీకాంత్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ కూడా `పేట` సినిమా ప్రమోషనల్స్ తో బిజీగా ఉంది. ఆ తర్వాత ఈయన మురుగదాస్ సినిమాతో బిజీ కానున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత రాజమౌళితో రజినీకాంత్ సినిమా చేమబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ పూర్తయ్యేనాటికి 2020 అవుతుంది.. ఆ లోపు రజినీ కూడా తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేయనున్నాడు. రజినీకాంత్ తన చివరి సినిమా రాజమౌళితోనే చేయబోతున్నాడనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయిప్పుడు. మరి ఇందులో నిజమెంతుందో అనేది రాజమౌళి స్వయంగా చెబితే కానీ క్లారిటీ రాదు. అప్పటి వరకు అభిమానులకు ఈ ఎదురుచూపులు తప్పవు మరి అంటున్నారు సినీ వర్గాలు.