రష్మిక.. తేడా కొడుతున్న డబ్బింగ్ బొమ్మలు
on Apr 3, 2021
`ఛలో`, `గీత గోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో తెలుగు కుర్రకారుని గిలిగింతలు పెట్టిన అందం.. రష్మిక మందన్న. దక్షిణాది సినిమాలతో మొదలైన ఆమె ప్రయాణం.. క్రమంగా ఉత్తరాది పరిశ్రమ వైపుకు సాగుతోంది. అక్కడ ఏకంగా `బిగ్ బి` అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది ఈ కన్నడ కోమలి.
ఇదిలా ఉంటే.. 2021 ప్రథమార్ధం రష్మికకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆమె నాయికగా నటించిన రెండు అనువాద చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయగా.. రెండింటికి ఆశించిన స్పందన రాలేదు. ఫిబ్రవరి 19న విడుదలైన కన్నడ డబ్బింగ్ బొమ్మ `పొగరు` రష్మికని పూర్తి స్థాయిలో నిరాశపరచగా.. ఏప్రిల్ 2న జనం ముందుకు వచ్చిన తమిళ అనువాద చిత్రం `సుల్తాన్` కూడా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ఆరంభ వసూళ్ళు ఫర్లేదనిపిస్తున్నప్పటికీ.. హిట్ స్టేటస్ కి చేరడం కాస్త కష్టమేనంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
మొత్తమ్మీద.. తక్కువ గ్యాప్ లోనే వచ్చిన రష్మిక డబ్బింగ్ బొమ్మలు తేడా కొట్టాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. ఆగస్టు 13న రిలీజ్ కానున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప`పైనే రష్మిక, ఆమె అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
Also Read