English | Telugu

చ‌ర‌ణ్ మ‌రోసారి గొంతు అరువిస్తున్నాడు!!

on Apr 20, 2019

 

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇటీవ‌ల బిగ్ బి ఓ వీడియో చేసి సోష‌ల్ మీడియా లో పెట్టి షాక్చిచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఇక సల్మాన్ ఖాన్, రామ్  చ‌ర‌ణ్ కు మ‌ధ్య ఉన్న స్నేహం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చ‌ర‌ణ్ జంజీర్ సినిమా చేసే త‌రుణంలో స‌ల్మాన్ ఎంతో హెల్ప్ చేసాడు. అప్ప‌టి నుంచి మొద‌లైంది వీరి స్నేహం. అదే స‌మ‌యంలో తెలుగులో విడుద‌లైన స‌ల్మాన్ సినిమా `ప్రేమ ర‌త‌న్ ధ‌న్ పాయో` సినిమాకు డ‌బ్బింగ్ చెప్పాడు చ‌ర‌ణ్‌.

అయితే మ‌రో సారి స‌ల్మాన్ కోసం రామ్ చ‌ర‌ణ్ త‌న గొంతుని అరువిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  స‌ల్మాన్ ఖాన్ తాజాగా న‌టించిన `భార‌త్` చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ విడుద‌ల కానుంది. ఈ సినిమాకు స‌ల్మాన్ పాత్ర‌కు మ‌రోసారి చ‌ర‌ణ్ త‌న గొంతుని అరువిస్తున్నాడు. త్వ‌ర‌లో డ‌బ్బింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  జూన్ 5న ఈ సినిమా విడుద‌ల కానుంది.


Cinema Galleries



Latest News


Video-Gossips