'మల్లేశం'లో మామ కోడలు... 'ప్లే బ్యాక్'లో తండ్రి కూతురు!
on Aug 8, 2019
'మల్లేశం' సినిమా చూశారా? ఆ చిత్రంతో తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల కథానాయికగా పరిచయం అయ్యారు. అదే చిత్రంలో ప్రియదర్శి తండ్రిగా, అనన్య మామగారిగా చక్రపాణి ఆనంద నటించారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన 'దాసి'లో కీలక పాత్ర చేసిన ఆయన మళ్లీ ఈ సినిమాతో పునరాగమనం చేశారు. 'మల్లేశం'లో వీరిద్దరి నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వీరిద్దరు సుకుమార్ స్నేహితుడు, 'దర్శకుడు' ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్న మలి చిత్రం 'ప్లే బ్యాక్'లో నటిస్తున్నారు. అయితే... ఈసారి మామ కోడళ్లుగా నటించడం లేదు. తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా హుషారు ఫేమ్ దినేష్ తేజ్ నటిస్తుండగా... అనన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె తండ్రి పాత్రలో చక్రపాణి ఆనంద నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.