English | Telugu

పందెంకోడి పార్ట్ 2 వచ్చేస్తోంది

on Jul 11, 2018

తెలుగువాడైనా కూడా విశాల్‌ తమిళనాట మంచి ఫాలోయింగ్‌ సంపాదించాడంటే దానికి కారణం సండకోళి సినిమానే! తెలుగులో పందెంకోడిగా రిలీజైన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. విశాల్‌ డబ్బింగ్‌ సినిమాలకు కొంత మార్కెట్‌ ఏర్పరిచింది. అందుకే ఇప్పుడు ఆ సండకోళి సినిమాకు సీక్వెల్‌ విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాడు విశాల్‌. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని అంతా పూర్తయిపోయి, విడుదలకు సిద్ధంగా ఉంది.

 

 

పందెంకోడి మొదటి భాగంలో మీరాజాస్మిన్‌ హీరోయిన్‌గా నటించగా ఈ సీక్వెల్‌లో మాత్రం మహానటి కీర్తిసురేష్ హీరోయిన్‌గా కనిపిస్తుందట. మొదటి భాగంలో విశాల్‌కు తండ్రిగా నటించిన రాజ్‌కిరణ్‌ ఈ సినిమాలోనూ ఆ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే తమిళ తెలుగు భాషల్లో డిటెక్టివ్‌, అభిమన్యుడు సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న విశాల్‌కు పందెంకోడి పార్ట్‌ 2 కనుక హిట్‌ అయితే స్టార్‌డమ్‌ ఖాయం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here