ENGLISH | TELUGU  

ఓ మైగాడ్..! కమల్, మోహన్ లాల్ కలిసి నటిస్తున్నారు!

on Aug 7, 2017

‘ఓ మై గాడ్’... బాలీవుడ్ లో అసాధారణ విజయం సాధించిన సినిమా. మనిషికీ, దైవానికీ మధ్య నడిచిన అద్భుతమైన డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. పరేశ్ రావెల్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో దైవం మానుష రాపేణా అనిపించే కృష్ణ పాత్రను అక్షయ్ కుమార్ చేశాడు. తెలుగులో ఇదే కథతో రూపొందిన చిత్రం‘గోపాల గోపాల’కూడా మంచి విజయం సాధించింది. ఇందులో వెంకటేశ్ హీరోగా నటించగా, పవన్ కళ్యాణ్ ‘కృష్ణ’ పాత్ర పోషించారు. 

నిజానికి ఇది కలకత్తాకు చెందిన ఓ డ్రామా. స్వతహాగా రంగస్థల నటుడైన పరేష్ రావెల్... ఈ ‘ఓ మై గాడ్’డ్రామాను కొన్ని వందల సార్లు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు. అయితే.. ఈ డ్రామాను అక్షయ్ కుమార్ అనుకోకుండా చూశాడు. దాన్ని సినిమాగా చేద్దామనే ప్రపోజల్ పరేష్ రావెల్ ముందుంచాడు. దానికి పరేష్ రావెల్ కూడా ఓకే చెప్పడంతో, డ్రామా హక్కులు కొని సినిమాగా తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ కథాంశంతో సాగే ఈ కథ నిజంగా జనరంజకం. 

ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి డిస్కషన్ దేనికబ్బా..! అనుకుంటున్నారా? ఈ కథ మరోసారి తెరకెక్కనుంది. తమిళంలో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయకునిగా సకలకళావల్లభుడు కమల్ హాసన్ నటించనున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ చేసిన ‘కృష్ణ’ పాత్రను మోహన్ లాల్ చేయనుండటం విశేషం. 

కథ రిత్యా ఇందులో హీరో నాస్తికుడు. దేవుడు అనేవాడు  ప్రత్యేకంగా ఉండడు. దైవం మానుష రూపేణా అని నమ్మే వ్యక్తి. నిజజీవితంలో కమల్ హాసన్ కూడా అంతే. సో... వ్యక్తిగతంగా ఆయనకు దగ్గరైన పాత్ర ఇది. మరి ఇప్పటికే పరేశ్ రావెల్, వెంకటేశ్ నటించిన పాత్రను కమల్ చేస్తున్నాడంటే... ఆటోమేటిగ్గా ఆ పాత్రపై జనాల్లో అంచనాలు పెరగడం ఖాయం. మరి కమల్ ఏ స్థాయికి ఆ పాత్రను తీసుకెళ్తాడో చూడాలి. మరో వైపు ‘క‌ృష్ణ’ పాత్ర కూడా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ పోషించారు. త్వరలో ఆ పాత్రను మోహన్ లాల్ చేయబోతున్నారు. మరి దానిపై కూడా అంచనాలు పెరిగడం సర్వసాధారణమే కదా. ఇద్దరు మహానటులు నటించనున్న ‘ఓ మైగాడ్’తమిళ వెర్షన్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడం ఖాయం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.