నిహారిక, సుమంత్ల వెడ్డింగ్ కనులవిందు
on Jun 30, 2018
మెగా డాటర్ నిహారిక.. మొదట యాంకర్ గా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.. అలానే వెబ్ సిరీస్ లతో యువతకు దగ్గరైంది.. అయితే నిహారిక 'ఒక మనసు' సినిమాతో వెండితెరకు కూడా పరిచయమైంది.. నిహారిక నటనకు మంచి మార్క్స్ పడ్డాయి కానీ, ఈ సినిమా ఫలితమే నిహారికకు నిరాశను మిగిల్చింది..
దీంతో కాస్త విరామం తీసుకొని ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.. పెళ్లి భోజనంలా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. పెళ్లి కుదిరినప్పుడు అబ్బాయి, అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటాయో దర్శకుడు చాలా సహజంగా చూపించినట్టు తెలుస్తుంది..
కుటుంబాన్ని వదిలి కొత్త వ్యక్తి జీవితంలోకి అడుగు పెడుతున్నాం అతను ఎలా చూస్కుంటాడో అని ప్రతి అమ్మాయి ఆలోచిస్తుంది.. అలానే, వచ్చే అమ్మాయి తన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటుంది అని ప్రతి అబ్బాయి ఆలోచిస్తాడు.. ఇదే విషయాన్ని దర్శకుడు మనస్సుకి నచ్చేలా చూపించబోతున్నాడని అర్ధమవుతుంది.. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే హ్యాపీ వెడ్డింగ్ తో నిహారిక హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.