English | Telugu

సునీల్ హీరోగా, వీరభద్రచౌదరి దర్శకత్వంలో "పూలరంగడు"

on Aug 17, 2011

సునీల్ హీరోగా వీరభద్రచౌదరి దర్శకత్వంలో "పూలరంగడు" చిత్రం రేపు ఘనంగా ప్రారంభం కాబోతూంది. వివరాల్లోకి వెళితే గతంలో అల్లరి నరేష్ హీరోగా "అహ నా పెళ్ళంట" చిత్రానికి దర్శకత్వం వహించిన వీరభద్ర చౌదరి తన మలి ప్రయత్నంగా సునీల్ హీరోగా "పూలరంగడు" అనే చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, ప్రముఖ సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి "పూలరంగడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ "పూలరంగడు" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఇషా చావ్లా గతంలో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన "ప్రేమ కావాలి" చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి హీరోయిన్ గా ప్రవేశించింది.

"పూలరంగడు" చిత్రం రేపు అంటే ఆగస్ట్ 18 వ తేదీన ఉదయం 11 గంటలకు, హైదరాబాద్ అన్నపూర్ణా స్టుడియోలో, సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కాబోతూంది. ఈ ""పూలరంగడు" చిత్రం కథ విషయానికొస్తే పల్లెటూర్లలో "పూలరంగడు"లా తిరిగిన మనిషి ప్రస్తుతం నగర జీవితానికి అలవాటుపడి ఒక అనాథలా బ్రతుకుతున్నాడు. నగర జీవితంలో ఏదో సాధించేద్దామని వచ్చిన మనిషి పల్లెటూరిలో తన జీవితంతో పోల్చుకుని చూస్తే ఎలా ఉంటుందో అదే ఈ "పూలరంగడు" చిత్రం కథ. గతంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా "పూలరంగడు" అనే చిత్రం వచ్చింది. ఆ "పూలరంగడు" చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఆ చిత్రం లాగే ఈ "పూలరంగడు" చిత్రం కూడా సూపర్ హిట్ కావాలని ఆశిద్దాం.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here