English | Telugu

ఈ సారి కూడా రాజమౌళి కథ బయటపెడతాడా?

on Mar 27, 2018

ప్రతి సినిమా స్టార్ట్ చేసేముంది కథ బయటపెట్టడం రాజమౌళి కి ఆలవాటు. అయితే, బాహుబలి 2 కి మాత్రం కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుతూ స్టోరీ విషయంలో క్లూస్ ఇచ్చాడు. ప్రస్తుతం, రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీయబోయే మల్టి స్టారర్ సినిమాకి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కథ విషయంలో పలు ప్రచారాలు జరుగుతుండగా, రామ్ చరణ్ మాత్రం తాను ఇంకా కథ వినలేదని రంగస్థలం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో చెప్పాడు. కొందరు, చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ముల క్యారెక్టర్స్ చేస్తున్నారని, మరి కొందరు వీళ్లిద్దరు బాక్సర్లుగా కనిపిస్తారని రక, రకాల కథనాలు ప్రచారం చేసారు.

మరి ఇంతకు ముందు లాగే, రాజమౌళి కూడా తన సినిమా కథ బయటపెడతాడో లేదో చూడాలి. కథ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రాజమౌళి ఈ మధ్య సినిమా అనౌన్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ లిద్దరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే రాజమౌళి మూవీ కి టైం కేటాయిస్తారు. ఇంతకు ముందులా కాకుండా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. సెప్టెంబర్ లో ఓపెనింగ్ సమయంలో జక్కన్న స్టోరీ రివీల్ చేస్తాడో లేదో చూడాలి!


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here