హిందీలోకి కీరవాణి కొడుకు సినిమా
on Jul 7, 2020
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన సినిమా 'మత్తు వదలరా'. దీనికి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. డ్రగ్స్ నేపథ్యంలో రూపొందింది. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని, సెలబ్రిటీలను బాగా ఆకట్టుకుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో తెలుగు సినిమాను నిర్మించిన చెర్రీ, హేమలత... హిందీలోనూ సినిమా నిర్మించనున్నారని తెలిసింది.
'మత్తు వదలరా'తో దర్శకుడిగా పరిచయమైన రితేష్ రానా చేతిలో హిందీ రీమేక్ కూడా పెట్టారని టాక్. తెలుగు సినిమాకు వర్క్ చేసిన మేజర్ టెక్నికల్ టీమ్, హిందీ రీమేక్‌కి వర్క్ చేయవచ్చని సమాచారం. 'అర్జున్ రెడ్డి', 'జెర్సీ'... ఇటీవలి కాలంలో హిందీలో రీమేక్ అయిన, అవుతున్న సినిమాల జాబితాలో 'మత్తు వదలరా' కూడా చేరిందన్నమాట. హిందీలో కాస్ట్ అండ్ క్రూను త్వరలో సెలక్ట్ చేస్తారట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
