బికినీలో మనీషా కొయిరాలా... 47 ఏళ్ల వయసులో!
on Jul 9, 2018
మనీషా కొయిరాలా తెలుగువారికి సుపరిచితమే! క్రిమినల్, భారతీయుడు లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఆమె టాలీవుడ్లో చెరిగిపోని జ్ఞాపకాలని వదిలి వెళ్లారు. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్‌తో పోరాడిన మనీషా, మళ్లీ నటిగా తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. అంతేకాదు డియర్ మాయా, సంజు సినిమాలలో తన నటనతో ఫుల్ మార్కులు కొట్టేశారు. ఇప్పుడ తన అభిమానులకు మరో ట్రీట్ ఇవ్వబోతున్నారు మనీషా. నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న ‘లస్ట్ స్టోరీస్’లో భాగంగా స్విమ్‌సూట్‌లో కనిపించనున్నారు. సినిమాల్లో స్విమ్‌సూట్ వేసుకోవడం ఆమెకి ఇది మొదటిసారట. అందుకే ప్రేక్షకులు తనని చూసి సర్ప్రైజ్ అవుతారంట దర్శకుడు దివాకర్ బెనర్జీ మనీషాని ఒప్పించాడట. ఈ సరికొత్త రూపంలో మనీషాని చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌కి సబ్‌స్ర్కయిబ్ చేయాల్సిందే!