పవన్ సినిమాలో తెలుగమ్మాయి
on Aug 18, 2014
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం తెలుగమ్మాయి మధుశాలిని తీసుకున్నారు. ఈమె ఒక ముఖ్యమైన టీవీ రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెర్షన్ ‘ఓ మై గాడ్’లో నిధి చేసిన రోల్‌ను తెలుగులో మధు చేస్తుందన్నమాట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్ రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.