నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ మీద కర్చీఫ్ వేసిన ఆమిర్
on Aug 10, 2020
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా 'లాల్ సింగ్ చద్దా'. ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... కరుణ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ 11 లేదా 18 తేదీలలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏడాది వెనక్కి వెళ్లిపోయారు.
క్రిస్మస్ 2021కి 'లాల్ సింగ్ చద్దా'ను విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్ రాజ్ బన్సల్ ట్వీట్ చేశారు. "ఈ ఏడాది క్రిస్మస్ నుండి వచ్చే ఏడాది క్రిస్మస్ కి.. ఆమిర్ ఖాన్ సినిమా వాయిదా పడింది" అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలే టర్కీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఆమిర్. ఇంతకుముందు లద్దాఖ్, ఢిల్లీలో మేజర్ పార్ట్ షూట్ చేశారు. లద్దాఖ్ లో మరో షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉంది. చైనా సైనిక చర్యల వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు టర్కీ వెళ్లి షూటింగ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read