ఏడుగురు భామలతో సంపూ కొబ్బరిమట్ట
on Apr 9, 2014
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే సంపూ నటిస్తున్న రెండవ చిత్రం "కొబ్బరిమట్ట". ఇందులో సంపూ మూడు విభిన్న పాత్రలు చేస్తున్నాడు. సంపూ.. పాపారాయుడు(రజినీకాంత్), పెదరాయుడు(మోహన్ బాబు) పాత్రలలో కనిపించడమే కాకుండా ఈతరానికి చెందిన ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలిసిందే. మరి ఈ ఏడుగురు హీరోయిన్లతో సంపూ ఎలాంటి రొమాన్స్ చేసి నవ్విస్తాడో త్వరలోనే తెలియనుంది.