న్యూడిటీ... నయా ఫ్యాషన్!
on Feb 20, 2020
అందాల భామలు అంగాంగ ప్రదర్శన చేస్తుంటే అందంగా కెమెరాలో బంధించడమే సెలబ్రిటీ ఫొటోగ్రఫీగా మారిన రోజులు ఇవి. కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం పలువురు భామలు బికినీల్లో ఫొటోలు దిగారు. ఫేమస్ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని మరో అడుగు ముందుకు వేశారు. ఒంటి మీద నూలు పోగు వేసుకోని హీరోయిన్ల అందాలు ఆరుబయట కనిపించకుండా ఏదో ఒక వస్తువును అడ్డుపెట్టి ఫొటోషూట్ చేశారు. ప్రతి ఏడాది డబూ రత్నాని క్రేజీ హీరోయిన్లతో క్యాలెండర్ షూట్ చేస్తారు. ఈ ఏడాదీ చేశారు. అయితే.. ఆ షూట్ లో ఎక్కువ న్యూడిటీ కనిపించింది.
తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన కియారా అద్వాణీ ఈ ఏడాది డబూ రత్నాని క్యాలెండర్ షూట్ లో హాట్ టాపిక్. టాప్ లెస్ గా... పై అందాలను కేవలం అరిటాకు కప్పుకుని మాత్రమే ఆమె ఫొటో దిగారు. ఈ ఫోటోపై మీమ్స్ చాలా వచ్చాయి. కియారాను అలా చూపించిన వ్యక్తిని కొట్టడానికి కబీర్ సింగ్ బయలు దేరాడని ఎక్కువమంది కామెడీ చేశారు. ఇక, పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అయితే పెద్ద పుస్తకాన్ని అందాలు కనిపించకుండా అడ్డు పెట్టుకున్నారు. భూమి ఫెడ్నేకర్ కూడా దుస్తులు లేకుండా ఫొటోషూట్ చేశారు. ఈ ఫొటోలో క్రియేటివిటీని తక్కువ చేయలేము. కానీ, న్యూడిటీ మాత్రమే నయా ఫ్యాషన్ కావడం శోచనీయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. కియారా, భూమి కంటే హాట్ హీరోయిన్లుగా ముద్రపడిన విద్యా బాలన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ దుస్తులు వేసుకుని ఫోటోషూట్ చేయడం గమనార్హం.