కాలాతో సూపర్ హిట్ కొట్టేలా వున్న రజినీకాంత్
on Mar 2, 2018
నిన్న విడుదలవ్వాల్సిన సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా టీజర్ జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య గారు శివైక్యం చెందడంతో ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసారు. ఇంతకు ముందే విడుదలయిన ఈ టీజర్ లో కబాలి తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలా... ఇదేం పేరు అనే నానా పాటేకర్ డైలాగ్ తో మొదలయిన టీజర్ లో తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. కాలా అంటే ఎవరు కాలుడు... కరికాలుడు... గొడవపాడయినా సరే కాపాడేవాడు... అంటూ బ్యాగ్రౌండ్ లో వచ్చే వాయిస్ రజినీకాంత్ క్యారెక్టర్ ని వివరిస్తుంది. నల్ల దుస్తులు, నల్ల కళ్లద్దాలు, నెరిసిన తెల్ల గడ్డంతో రజినీకాంత్ స్టైలిష్ గా ఉన్నాడు. వాస్తవానికి, రజిని ఎలా ఉన్న స్టైలిష్ గానే ఉంటాడు... అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజం ఎప్పుడు చూడలేదు కదూ... ఇప్పుడు చూపిస్తా అంటూ రజిని చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. మొత్తానికి, ఈ టీజర్ ని అంతగా పండని సంభాషణలు, ఫైట్ లతో నింపేశారు. సంతోష్ నారాయణ్ కబాలి కి వాడిన బ్యాగ్రౌండ్ స్కోరే మళ్ళీ వాడినట్టున్నాడు. పా. రంజిత్ దర్శకత్వంలో, ధనుష్ నిర్మాణంలో వస్తున్న కాలా ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. తెలుగు బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వకపోవడంతో, నిర్మాత ధనుష్ టీజర్ తో అయినా బయ్యర్లని ఇంప్రెస్స్ చేద్దామనుకున్నారు. కానీ ఈ టీజర్ తో అది జరిగే పనేనా!
Also Read