డిసెంబర్లో 'కేజీఎఫ్ 2' భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్
on Nov 23, 2020
కన్నడ చిత్ర పరిశ్రమలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన చిత్రం కేజీఎఫ్. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ భారీ బడ్జెట్ మూవీ.. విడుదలైన అన్ని చోట్ల వసూళ్ళ వర్షం కురిపించింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కేవలం రెండు పోరాట ఘట్టాల తాలూకు చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. డిసెంబర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ జరుగనుంది.
కాగా ఈ షూటింగ్ లో రాక్ స్టార్ యష్ తో పాటు రీసెంట్ గా లంగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. తన ఆరోగ్య సమస్యల కారణంగా.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 షూటింగ్ కి బ్రేక్ పడడంతో.. సంజు బల్క్ డేట్స్ కేటాయించారట. కాగా 2021 వేసవిలో ఈ పాన్ ఇండియా వెంచర్.. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2లో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు.