తారక్ పుట్టినరోజునే ముహూర్తమా?
on Jan 27, 2021
ఈ ఏడాది దసరాకి బడా మల్టిస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ తో పలకరించబోతున్నారు యంగ్ టైగర్ యన్టీఆర్. మరికొద్ది రోజుల్లో తన పాత్ర తాలూకు చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఆ నెక్ట్స్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించనున్నారు. ఉగాదికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని రీసెంట్ గా కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది. అంతేకాదు.. శరవేగంగా సినిమాని పూర్తిచేసి 2022 సంక్రాంతికి విడుదల చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రానుంది.
యన్టీఆర్ 30గా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి అయినను పోయిరావాలె హస్తినకు, రాజా వచ్చినాడు, చౌడప్ప నాయుడు వంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు.