English | Telugu

త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ డైట్, ఫిట్నెస్ ప్లాన్ ఇదే

on Mar 2, 2018

యమదొంగ కోసం సన్నబడి, బృందావనం కోసం క్లాస్ లుక్ ట్రై చేసి, టెంపర్ కోసం సిక్స్ పాక్స్ పెంచి, నాన్నకు ప్రేమతోలో డిఫరెంట్ గెటప్ లో అలరించి, జై లవ కుశ లో మూడు విభిన్న పాత్రలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం కోసం ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త అవతారంలో కనువిందు చేయనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు. హాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ ట్రైనింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ డైట్ మరియు ఫిట్నెస్ ప్లాన్ వివరాలు మీ కోసం:

బ్రేక్ ఫాస్ట్: ప్రొద్దున్నే అధిక కార్బ్స్ ఉన్న ఆహారం తీసుకుంటున్న జూనియర్, తర్వాత తీసుకునే ఆహారం లైట్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్, కొంచెం చికెన్, పళ్ళు మరియు తాజా కూరగాయలు తీసుకుంటున్నాడు.

లంచ్ మరియు డిన్నర్: ప్రోటీన్లు ఎక్కువగా ఉండే రోస్ట్ చేసిన చికెన్, మటన్, చేపలు, కూరగాయలు లంచ్ మరియు డిన్నర్ లో తీసుకుంటున్నాడు ఎన్టీఆర్.

స్నాక్స్: ఇక స్నాక్స్ విషయానికి వస్తే, లంచ్ లేదా డిన్నర్ చేసే ముందు కొన్ని బాదం మరియు వాల్నట్స్ తీసుకుంటున్నాడు.

ఫిట్నెస్ ప్లాన్: తారక్ రోజుకి దాదాపు 4 గంటలు జింలో గడుపుతున్నాడట. ఉదయం గంటన్నర కేవలం హార్ట్ కి సంభందించి వ్యాయామం చేస్తుంటే, సాయంత్రం గంటన్నర బాడీ షేప్ కోసం ఎక్సయిజులు చేస్తున్నాడట. ఈ కఠినమయిన ట్రైనింగ్ లో ప్రధానంగా తారక్ పుష్ అప్స్, ఫుల్ అప్స్ మరియు బర్పీస్ చేస్తున్నాడట.

సో, త్వరలో మనం కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నామన్నమాట!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here