బిగ్ బాస్-2 లో ఎన్టీఆర్
on Jun 7, 2018
'బిగ్ బాస్' షో హిందీలో పెద్ద హిట్.. మరి తెలుగులో ఎలా ఉంటుందో అనుకున్నారు.. కానీ ఎన్టీఆర్ తన అద్భుతమైన టైమింగ్ తో షోని చాలా పెద్ద హిట్ చేసాడు.. దీంతో 'బిగ్ బాస్-2 ' కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసారు.. ఇంతలోనే ట్విస్ట్.. ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా, బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ ప్లేస్ లో నాని.. ప్రేక్షకులు కాస్త నిరాశ చెందినా, నాని కూడా మెప్పిస్తాడన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.. ఆ ఆశని ఆనందంగా మార్చే గుడ్ న్యూస్ ఒకటి బిగ్ బాస్-2 లో ఉన్నట్టు తెలుస్తుంది.. అదేంటంటే బిగ్ బాస్-2 లో మనం ఎన్టీఆర్ ని చూడబోతున్నామట .. హోస్ట్ గా కాదు గెస్ట్ గా.. బిగ్ బాస్-2 ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడంట.. ఇది నిజమైతే ప్రేక్షకులకు నిజంగా పండగే...