విజయ్ దేవరకొండ హీరోయిన్ ఓ క్లారిటీ ఇచ్చింది!
on Feb 5, 2019
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బ్రెజిల్ మోడల్ ఇసబెల్లా ఓ హీరోయిన్. అఖిల్ 'మిస్టర్ మజ్ను'లో అతిథి పాత్రలో కూడా నటించిందీ ఫారిన్ బ్యూటీ. లండన్‌లో అఖిల్ చదివిన యూనివర్సిటీ డీన్ కుమార్తె పాత్రలో కనిపించింది. ఈ హీరోయిన్ ఓ తెలుగు సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చింది. 'ప్రేమించుకుందాం రా', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారు బాగున్నారా', 'శంకర్ దాదా ఎంబిబిఎస్' సినిమాల దర్శకుడు జయంత్ సి. పరాన్జీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా 'నరేంద్ర'. నీలేష్ హీరోగా, రెజ్లింగ్ లెజెండ్ ఖలీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇసబెల్లా హీరోయిన్ అని ఓ ప్రెస్ నోట్ వచ్చింది. దీన్ని ఆమె ఖండించింది. తాను ఆ సినిమా చేయడం లేదని చెప్పింది. 'నరేంద్ర'లో నటించమని తనను ఎవరూ నేరుగా సంప్రదించలేదని ఇసబెల్లా చెప్పింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
