English | Telugu

చిరంజీవితో ఇలియానా?

on Sep 5, 2019

 

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. అంతకంటే ముందు మెగాస్టార్‌ పక్కన హీరోయిన్‌ని ఎంపిక చేయాలని కొరటాల కిందామీదా పడుతున్నారట! అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవికి జోడీగా నయనతార నటించారు. అలాగే, సినిమాలో తమన్నా కూడా ఉన్నారు. అందుకని, వీరిద్దరినీ కాకుండా కొత్తవాళ్ల కోసం ప్రయత్నించారు. ఒకానొక సమయంలో నయనతారను మరోసారి రిపీట్‌ చేయాలనుకున్నారట! ఆమెను వద్దనుకున్నారో... డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదో... హీరోయిన్‌ ఆప్షన్స్‌ నుండి నయనతార పేరును పక్కన పెట్టారు. తర్వాత శ్రుతీ హాసన్‌ పేరు వినిపించింది. తర్వాత చాలామంది హీరోయిన్ల పేర్లు వచ్చాయి. వెళ్లాయి. ఇప్పుడు ఇలియానా పేరు వినబడుతోంది. రవితేజ తప్ప సీనియర్‌ హీరోల పక్కన ఈ గోవా సుందరి నటించలేదు. కానీ, హిందీలో సైఫ్‌ అలీ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌కుమార్‌ వంటి సీనియర్‌ హీరోల పక్కన చేశారు. పైగా, చేతిలో పెద్దగా సినిమాలు లేవు. మెగాస్టార్‌ సినిమా కనుక యస్‌ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆమెను తీసుకుంటారా? లేదా? అనేది చిరంజీవి, కొరటాల తీసుకునే నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here