English | Telugu

వన్ (హీరో) + సిక్స్ (హీరోయిన్స్) = సెవెన్!

on Apr 20, 2019

 

రవిబాబు 'నువ్విలా' సినిమాతో హవీష్ హీరోగా పరిచయమయ్యాడు. తరవాత 'జీనియస్', 'రామ్ లీలా' సినిమాలు చేశాడు. కొంత విరామం తరవాత 'సెవెన్' అని ఒక డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇందులో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే... హీరో ఒక్కడే. హీరోయిన్లు మాత్రం ఆరుగురు. ఆ ఆరుగురితోనూ హీరో ప్రేమకథలు నడుపుతాడు. ఒకేసారి అంతమందిని ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతణ్ణి ఎందుకు కోరుకుంటోంది? అనేది సినిమా అట!

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్  ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.


Cinema Galleries



Latest News


Video-Gossips