తమిళ్- హిందీ భాషల్లోకి `ఎఫ్ 2` !!
on Feb 1, 2019
అనిల్ రావిపూడి తర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషనల్ లో వచ్చిన మల్టీ స్టారర్ ఎఫ్2 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వంద కోట్ల మైలు రాయిని అందుకుని దిల్ రాజు చిత్రల్లో నెంబర్ వన్ గా నిలిచింది. మరి ఇంత హిట్టయిన సినిమాను రీమేక్ చేయకుండా ఉంటారా? ఇప్పుడు ఈ సినిమాను కూడా హిందీ, తమిళ్ భాషల్లో రీమేక్ చేయలన్నా ఆలోచన ఉన్నారట. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న దిల్ రాజు దీనిపై మాట్లాడుతూ..ఈ సినిమాను బాలీవుడ్ లో పలువురు హీరోలు చూస్తునే ఉన్నారు. ఈ సినిమా రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి వీలుంటే హిందీలో చిత్రాన్ని నేనే నిర్మించాలని చూస్తున్నా కానీ ఈ ఏడాది తెలుగులో చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. కాబట్టి సొంతంగా నిర్మించడమే కంటే నిర్మాణ భాగస్వామిగా ఉండటమే మంచిదని భావిస్తున్నా అని చెప్పారు. అన్నీ ఓకే అయిన తరువాత సినిమా క్యాస్టంగ్ వివరాలు చెపుతుమన్నారు. మరి చూద్దాం అక్కడ ఏ హీరోలు చేస్తారో..?
Also Read