`వెంకీ మామ ` మాత్రమే చేస్తున్నాడు-డి.సురేష్ బాబు
on May 7, 2019
ఇటీవల సోషల్ మీడియాలో వెంకటేష్ తమిళ సినిమా `విక్రమ్ వేద` ను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీని పై సురేస్ బాబు క్లారిటీ ఇస్తూ....`` వెంకటేష్ విక్రమ్ వేద చేస్తున్నాడంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమే. ప్రజంట్ వెంకటేష్ , నాగచైతన్య `వెంకీమామ` సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తదుపరి సినిమా గురించి త్వరలో అధికారికంగా ఎనౌన్స్ చేస్తాము అంటూ మీడియాకు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అయితే వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేయట్లేదు అంటూ మాత్రం చెప్పలేదు. సో దీన్ని బట్టి వినాయక్ దర్శకత్వంలో సినిమా నిజమే కానీ, విక్రమ్ వేద మాత్రం కాదు అని అర్థం అంటున్నారు సినీ జనాలు. నెక్ట్స్ ఎనౌన్స్ మెంట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం.