English | Telugu

అమెరికన్స్ ను కదిలించిన చిరు పాట...

on Mar 5, 2018

 

ఇప్పుడున్న సినిమా హీరోలు ఎవర్ని అడిగినా మా ఇన్ఫిరేషన్ చిరంజీవిగారే అని టక్కున చెప్పేస్తారు. ఆయన నటనతో, డాన్స్ తో అందరినీ అలరించి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ సంపాదించుకున్నారు. ఆ తరువాత ఇప్పటివరకూ ఏ హీరో ఆ స్థానాన్ని భర్తీ చేయలేదంటేనే చెప్పుకోవచ్చు. దాదాపు తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆ తరువాత వచ్చిన  ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చూస్తే ఆయన నటనలో కానీ డ్యాన్స్ లో కానీ ఏం మార్పు రాలేదు.  ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో చిరంజీవి తన డాన్స్‌లోని పవర్‌ను మరోసారి ప్రేక్షకులకు చూపించారు. అయితే ఇప్పుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాలోని ‘సన్నా జాజిలా పుట్టేసిందిరో’ పాట బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయగా.. చిరు తన గ్రేస్ తో డాన్స్ కు మరింత అందాన్ని తెచ్చారు. ఈపాటకు  చాలా మంది డాన్సర్లు స్టేజ్ షోలలో స్టెప్పులేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఇదే పాటకు వేరే దేశంలో డాన్సర్లు స్టెప్పులు వేశారు. అది కూడా అమెరికాలో. అమెరికాలో బాగా పాపులర్ అయిన స్టీవ్ హార్వే కామెడీ షోలో ఓ బృందం ‘సన్నా జాజిలా పుట్టేసిందిరో’ పాటకు స్టెప్పులేసింది. తమ స్టెప్పులతో చూపరులను కట్టిపడేసింది. ఇదే గొప్ప విషయం అనుకుంటే... వారి డ్యాన్స్‌కు అమెరికన్‌ ప్రేక్షకులు నిలబడి మరీ చప్పట్లు కొట్టడం ఇంకా గొప్ప విషయం. ఇప్పుడు ఈ డాన్స్ వీడియోను రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొత్తానికి చిరంజీవి పాటలను విదేశాల్లో కూడా ఇంత క్రేజ్ ఉండటం గొప్ప విషయమే.


Cinema Galleries



Latest News


Video-Gossips