'అఖిల్' ఎఫెక్ట్..మోక్షజ్ఞకి నో చెప్పిన బోయపాటి
on Jan 8, 2019
నందమూరి కుటుంబం నుంచి మరో నట వారసుడిగా వెండితెర అరంగేట్రానికి సిద్ధపడిన బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. గత కొంత కాలంగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ..తండ్రి బాలకృష్ణ పాత్రలో కనిపిస్తాడనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ విషయంపై కూడా నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి. కానీ మోక్షజ్ఞ తో బోయపాటి సినిమా చేయనున్నాడు. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు. తాను ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే అభిమానులు అంచనాలు తారా స్థాయికి చేరతాయని, తొలి సినిమాకు ఆ స్థాయి అంచనాలు కరెక్ట్ కాదన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. గతంలో అక్కినేని అఖిల్ హీరో గా వచ్చిన మొదటి సినిమా 'అఖిల్' కి వి.వి.వినాయక్ డైరెక్షన్ అనగానే భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విఫలం అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మోక్షజ్ఞ ఎంట్రీకి బోయపాటి వెనకడుగు వేసినట్లు టాలీవుడ్ టాక్.