'బాహుబలి'కి భారీ రేటు
on Jan 24, 2015
రాజమౌళి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' హిందీ రీమేక్ రైట్స్ భారీ రేట్ పలికినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలుగులో ఇంకా రిలీజ్ కూడా కానీ ఈ సినిమా రీమేక్ హక్కులను యూటీవీ మోషన్ పిక్చర్స్, యాశ్రాజ్ ఫిలింస్ సంయుక్తంగా కలిసి భారీ ధర చెల్లించి తీసుకున్నట్లు సమాచారం. గతంలో రాజమౌళి డైరెక్షన్లో వచ్చి హిందీలో రీమేక్ చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి కనుక ఇప్పుడీ ఈ సినిమాను పక్కా హిట్టవుతుందనే నమ్మకంతో బాలీవుడ్ వర్గాలు వున్నాయట. త్వరలోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ప్రస్తుతం బాహుబలి మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ఏప్రిల్లో విడుదల కానుంది.