అల్లు అర్జున్.. కనబడుటలేదు!
on Apr 8, 2019
టైటిల్ చూసి తప్పుగా అనుకోవద్దు. అల్లు అర్జున్ రెండు మూడు రోజులకు ఒకసారైనా ట్విట్టర్ లేదా ఇన్ స్టాగ్రామ్ లో కనిపిస్తున్నారు. మరి, కనబడుటలేదు అంటున్నారేంటి అనే సందేహం వచ్చిందా? అది అల్లు అర్జున్ కొత్త సినిమా క్యాప్షన్. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు అంగీకరించిన స్టైలిష్ స్టార్... మరో సినిమాకు సంతకం చేశారు. 'ఎంసీఏ' ఫ్రేమ్ వేణు శ్రీరామ్ కు ఆయన అవకాశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. 'ఆర్య', 'పరుగు', 'దువ్వాడ జగన్నాథమ్ డీజే' సినిమాల తర్వాత అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. దీనికి 'ఐకాన్ - కనబడుట లేదు' టైటిల్ ఖరారు చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా వివరాలు ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.