English | Telugu

'మనవడి' గా తనయుడు

on Apr 12, 2019

 

నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా 'సోగ్గాడే చిన్నయినా' నిలించింది. ఇందులో రెండు పాత్రల్లో నటించి అలరించిన నాగార్జున అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచి పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం `బంగార్రాజు` వస్తోంది. నాగార్జున కు తోడుగా మరో పాత్ర కూడా ఈ కథలో ఉంది. `బంగార్రాజు` కి అతని మనవడికీ  జరిగే కథ ఇది. ఆ పాత్ర లో అఖిల్ కనిపించనున్నారని సమాచారం. ఇంతకు  ముందు ఈ పాత్ర  కోసం నాగచైతన్య పేరు పరిశీలించారు. అయితే చైతూ కంటే, అఖిల్ కి ఈ పాత్ర బాగుంటుందని అఖిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. `మన్మథుడు 2` షూటింగ్ లో ఉన్నారు నాగార్జున. ఆ సినిమా పూర్తయ్యాకే `బంగార్రాజు` పట్టాలెక్కుతుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here