English | Telugu

ఆటగదరా శివ రివ్యూ

on Jul 20, 2018

నటీనటులు:  దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది తదితరులు..        
సంగీతం: వాసుకి వైభవ్                                     
కెమెరా:  లివిత్                          
నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్                               
దర్శకత్వం: చంద్రసిద్ధార్ధ                                  
విడుదల తేదీ: 20/07/2018  
కన్నడలో మంచి విజయం సొంతం చేసుకొన్న "రామ రామ రే" చిత్రానికి రీమేక్ గా రూపొందిన చిత్రం "ఆటగదరా శివ". "ఆ నలుగురు" ఫేమ్ చంద్రసిద్ధార్ధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా ఉదయ్ శంకర్ హీరోగా పరిచయమవ్వగా.. కన్నడ సీనియర్ నటుడు దొడ్డన్న తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మరి కన్నడ సినిమా స్థాయిలో తెలుగు రీమేక్ ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అనేది రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ:

ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకుని ఓ ఖైదీ బాజీ (ఉదయ్ శంకర్) జైల్ నుంచి తప్పించుకొని బయటపడతాడు. మార్గమధ్యంలో అనుకోకుండా త‌న‌ను ఉరితీయాల్సిన తలారి జంగయ్య (దొడ్డన్న)ను కలుస్తాడు. వాళ్లెవ‌ర‌న్న విష‌యం ప‌ర‌స్ప‌రం తెలియ‌క‌పోవ‌డంతో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఆ ప్ర‌యాణంలో వాళ్ల‌కు ఎదుర‌య్యే అనుభ‌వాలు ఏంటి?  వాళ్లు ఎవ‌రెవ‌రిని క‌లిశారు? చివరికి జంగయ్య ఉరిఖైదీ అయిన బాబ్జీకి శిక్ష వేయగలిగాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే "ఆటగదరా శివ" చిత్రం.

పాజిటివ్స్:

సంగీతం
సాహిత్యం
దొడ్డన్న నటన  

నెగిటివ్స్:

నేటివిటీ
లిప్ సింక్ లేకపోవడం
కథనం
స్క్రీన్  ప్లే  
 
ఎనాలసిస్:

నిడివి తగ్గించడం కోసం ఒరిజినల్ వెర్షన్ లో బాగా పేలిన సన్నివేశాలను డిలీట్ చేయడం పెద్ద మైనస్. ఖైదీ జైల్ నుంచి పారిపోయే సీక్వెన్స్, కథలోని సారాంశాన్ని వివరించే పాటను సినిమాలో నుంచి లేపేయడం పెద్ద మైనస్. అలా ఆసక్తికరమైన సన్నివేశాలన్నీ తీసేసి ఏదో ఖర్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్న లైవ్ డాక్యుమెంటరీలా సినిమాని నడిపించడం అనేది దర్శకుడు చంద్రసిద్ధార్థ వైఫల్యంగా పేర్కొనాలి. ఈ కారణంగా ఒరిజినల్ వెర్షన్ చూసిన ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో నిరాశపరిచే "ఆటగదరా శివ" ఆ సినిమా చూడకుండా ఏదో వైవిధ్యమైన సినిమా అనుకోని థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. సినిమాలో ఎమోషన్ అనేది ఎక్కడా కనిపించదు. ఒక్కటంటే ఒక్క సన్నివేశానికి కూడా ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. ఆ కారణంగా "ఆటగదరా శివ" మరో ఫెయిల్డ్ రీమేక్ గా నిలిచిపోయింది.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ఆర్టిస్టులు సినిమాలో ఎవరూ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్.

నటీనటులు:

బేసిగ్గా దొడ్డన్న అద్భుతమైన నటుడు, కన్నడలో దాదాపు 200 సినిమాల్లో నటించిన ఆయనకు ఇదే తొలి తెలుగు చిత్రం అవ్వడం వలన చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ అవ్వలేదు, అలాగే ఆ పాత్రలో ఆయన జీవించగలిగాడు కానీ.. ఆ పాత్రను ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేయలేకపోయాడు. ఉదయ్ శంకర్ స్క్రీన్ ప్రెజన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ పాత్రను హైలైట్ చేయలేకపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న రఫ్ నెస్ కానీ రా ఫీల్ కానీ ఉదయ్ శంకర్ ముఖ్యంలో కానీ గెటప్ లో కానీ ఎక్కడా కనిపించదు. హైపర్ ఆది పంచ్ లన్నీ పాచిపోయాయి, మనోడి నటన కూడా ఏదో జబర్డస్త్ స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్నట్లే కనిపించడం గమనార్హం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీధర్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాడు. అతడి నటన సినిమాకి పెద్దగా ప్లస్ అవ్వకపోయినా.. అతడికి మంచి గుర్తింపు తీసుకొస్తుంది.

సాంకేతిక విలువలు:

ఒరిజినల్ వెర్షన్ కు వర్క్ చేసిన సంగీత దర్శకుడు వాసుకి వైభవ్, లివిత్ తెలుగు నేటివిటీని తెరపై పండించడంలో విఫలమయ్యారు. అయితే.. టెక్నీషియన్స్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకోగలిగారు. సినిమా ఎలా ఉందంటే! ఒక మంచి ప్రయత్నం అనదగ్గ చిత్రం "ఆటగదరా శివ". నేటివిటీ మరియు తెలిసిన ఆర్టిస్ట్స్ ఎవరూ లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా వైవిధ్యం కోరుకొనే కొందరు ప్రేక్షకులకి మాత్రం ఒక మోస్తరుగా నచ్చే అవకాశం ఉంది.  

తెలుగు ఒన్ ప్రోస్పెక్టివ్:

ఈ చంద్రసిద్ధార్ధుడి ఆట అందరికీ అర్ధమవ్వదు.  

రేటింగ్: 2.25

 


Cinema GalleriesLatest News


Video-Gossips